More

    పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య అనుమానాస్పద మృతి

    పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య అనుమానాస్పదస్థితిలో మరణించారు. రమల్లాలోని భారత రాయబార కార్యాలయంలోనే ఆయన విగత జీవిగా కనిపించారు. ముకుల్ ఆర్య, పాలస్తీనాలోని భారత రాయబార కార్యాలయంలో శవమై కనిపించినట్లు స్థానిక మీడియా ఆదివారం నివేదించింది. ముకుల్ ఆర్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

    “రమల్లాలో భారత ప్రతినిధి శ్రీ ముకుల్ ఆర్య మరణించడం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి ముకుల్ ఆర్య.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ మృతి వార్త తెలిసిన వెంటనే పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ భౌతిక కాయాన్ని తరలించేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.

    ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదువుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కోల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలోనూ పనిచేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలోనూ పనిచేశారు. ఆయన ఢిల్లీలో పెరిగారు, చదువుకున్నారు. పాలస్తీనాలోని రమల్లాలో ఉన్న భారత ప్రతినిధి కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం 2008లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరడానికి ముందు ఢిల్లీ యూనివర్సిటీ, JNUలో ఎకనామిక్స్ చదివారు.

    Trending Stories

    Related Stories