More

    బ్రేకింగ్: రాజీనామా చేసిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ

    బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. దేశ అభివృద్ధికి నఖ్వీ చేసిన కృషికి ప్రధాని మోదీ బుధవారం ప్రశంసించారు. నఖ్వీ పనితనాన్ని మోదీ మెచ్చుకోవడం, అది ఆయన చివరి కేబినెట్ సమావేశమని సూచించడం జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే.. నఖ్వీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.

    కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ (జెడియు) ఇద్దరూ రాజ్యసభ పదవీకాలాన్ని జూలై 7న ముగియనుంది. బీజేపీ, జెడియు పార్టీలు వారిని మళ్లీ రాజ్యసభకు పంపలేదు. జులై 7తో పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎంపిలుగా ఎన్నిక కాకపోతే మంత్రులిద్దరూ కేబినెట్‌ సీట్లు కోల్పోతారు. ఇక ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని బీజేపీ మళ్లీ నామినేట్‌ చేయలేదు.

    spot_img

    Trending Stories

    Related Stories