రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన ముకేష్ కుమార్ మీనా

0
910

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్‌ మీనా నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముకేష్ కుమార్ మీనాను కె.విజయానంద్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు పరిచయం చేశారు.

1988-బ్యాచ్ అధికారి అయిన ముఖేష్‌కుమార్ మీనా గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా, పర్యాటక రంగ కార్యదర్శిగా, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్‌గా, వాణిజ్యం ప‌రిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా పనిచేశారు.