రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి 5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ ఉదయం ధామ్ వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ స్వాగతం పలికారు. అంబానీ ప్రతి సంవత్సరం ఈ పురాతన ఆలయాన్ని సందర్శిస్తారు.
బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించిన ముకేశ్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. బద్రీ కేదార్ ఆలయ కమిటీకి ఆయన 5 కోట్లు విరాళం ఇచ్చారు. బద్రీనాథ్‌లో జరిగిన గీతా పాఠ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన కేదార్‌నాథ్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్నారు.
ఆయన పర్యటన ఇప్పటికే వాయిదా పడింది. గత నెలలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది. గత నెలలో, RIL చైర్మన్ ఆలయాన్ని సందర్శించడానికి డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన మందిరం వైపు వెళ్లలేకపోయారు. కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లిన ఆయన దర్శనాన్ని రద్దు చేసుకున్నారు.
గత నెలలో అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ప్రార్థనలు చేసి, వేంకటేశ్వరుని ఆలయానికి 1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 12న, అంబానీ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు సమీపంలో ఉన్న నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. 2019లో, అంబానీ చందనం, కుంకుమ కొనుగోలు కోసం బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి సుమారు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు.