More

  ఎర్రకోటపై కన్నేసిన మొఘల్ వారసులు..!

  మొఘల్స్ దాదాపు 400 ఏళ్లపాటు దేశాన్ని దోచుకుతిన్నారు. పురాతన కట్టడాలను కూల్చివేశారు. మన పూర్వీకులు కట్టిన కోటల రూపురేఖలను మార్చేసి.. తమవిగా చెప్పుకుని పబ్బం గడిపారు. ఆ తర్వాత డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, బ్రిటిష్ వాడు అందినకాడికి దోచుకుపోయారు. ఇదంతా చరిత్ర. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యాలు లేవు. బ్రిటిష్ వలస పాలనలు లేవు. కానీ, దేశంలో ఆనాటి వాసనలు మాత్రం పోలేదు. మొఘల్ వారసత్వం దేశంలో ఇంకా మిగిలేవుంది. అయినా, వారిని భారత్ అక్కున చేర్చుకుంది. స్వదేశీయులుగానే గుర్తించి పౌరసత్వం కల్పించింది. అదీకాకుండా.. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా.. మతం ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి పోషిస్తోంది. ఇంతచేసినా,.. ఆశ్రయం కల్పించినవాడికే వెన్నుపోటు పొడవాలన్న.. తమ పూర్వీకుల బుద్ధి మాత్రం.. మొఘల్ వారసుల్లో ఇప్పటికీ మారలేదు.

  ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ మొఘల్ వారసురాలు ఏకంగా ఎర్రకోటపైనే కన్నేసింది. ఇదుగో ఈవిడే ఆవిడ. పేరు సుల్తానా బేగం. చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ ముని మనవడి భార్య. ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్న ఈవిడగారి కన్ను ఎర్రకోటపై పడింది. అది తమ పూర్వీకుల కట్టడమని.. దానిని తనకు స్వాధీనం చేయాలంటూ.. ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషిన్ వేసింది. ఈవిడగారి పిటిషన్ చూసి ఆశ్చర్యపోయిన న్యాయస్థానం.. సుల్తానా బేగం పిటిషన్‎ను నిర్ద్వందంగా తిరస్కరించింది. చేతికి అద్దమిచ్చి అందులో ముఖం చూసుకొమ్మన్నంత పనిచేసింది.

  68 ఏళ్ల సుల్తానా బేగం, తన న్యాయవాది వివేక్ ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్‌లో,.. తాను ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో వున్న ఓ మురికివాడలో నివసిస్తున్నానని.. చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో కాలం వెల్లదీస్తున్నట్లు పేర్కొంది. తాను నిరక్షరాస్యురాలినని.. ఎర్రకోట తమ పూర్వీకుల ఆస్తి అని.. 1857లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బలవంతంగా లాక్కుందని తెలిపింది. ఇందుకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదని పిటిషన్‎లో పేర్కొంది. తన పూర్వీకుల ఆస్తిని తిరిగి తనకు అప్పగించాలని విన్నవించుకుంది. మొఘల్ సామ్రాజ్యంలో చివరి రాజు రెండవ బహదూర్ షా జాఫర్.. స్వయానా మావారికి ముత్తాత అని వరుసల్ని వివరించింది. తద్వారా ఎర్రకోటకు నిజమైన వారసురాలిని తానేనని.. తన ఆస్తిని భారత ప్రభుత్వం అక్రమంగా కలిగివుందని.. ఆ ఆస్తిని వెంటనే తనకు అప్పగించాలని కోరింది.

  సుల్తానా బేగం వేసిన పిటిషన్‎ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును టేకప్ చేసిన జస్టిస్ రేఖా పల్లి.. 150 ఏళ్లకు పైగా జాప్యం తర్వాత కేసు దాఖలు చేసిన పిటిషనర్.. ఆస్తి తమదేనని చెప్పడానికి ఎలాంటి సహేతుకమైన వివరణ ఇవ్వలేదంటూ పిటిషన్‎ను తిరస్కరించారు. సుల్తానా బేగం లేదా ఇతర బహదూర్ షా జాఫర్ యొక్క వారసులు.. ఇన్నేళ్లుగా ఎందుకు క్లెయిమ్ చేయలేదన్నారు. అంతేకాదు, సకాలంలో పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని సుల్తానా బేగంను ప్రశ్నించారు. మీ పూర్వీకులు క్లెయిమ్ చేయని ఆస్తిని.. ఇప్పుడు మీరెలా క్లెయిమ్ చేస్తారని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. అయినా ఈ విషయంలో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని మొట్టికాయలు వేసింది.

  ఇదిలావుంటే, మొఘల్ వారసురాలిగా నెలకు 6 వేల రూపాయల పెన్షన్ కూడా తీసుకుంటోంది సుల్తానా బేగం. దీనికి సంబంధించిన వివరాలను కూడా పిటిషన్ లో పేర్కొంది. తన భర్త మీర్జా మహమ్మద్ బేదర్ భక్త్‎ను 1960లోనే రెండవ బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది. తన భర్తకు రాజకీయ పెన్షన్ కూడా మంజూరు చేసిందని తన పిటిషన్‎లో వెల్లడించింది. 1980 మే 22న బేదర్ భక్త్ మరణించిన తర్వాత.. ఆయన భార్య సుల్తానా బేగంకు పెన్షన్ వస్తోంది.

  సుల్తానా బేగం గతంలో ఓసారి.. నేషనల్ మాన్యుమెంట్స్ రెవిన్యూ విషయంలో ఓ కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ.. సోనియా గాంధీకి లేఖ రాసింది. మొఘల్ కట్టడాల నుంచి ప్రభుత్వం ఆదాయం పొందుతోందని.. ప్రతి ఏటా సందర్శకుల నుంచి ఎంట్రీ ఫీజు రూపంలో కోట్లాది రూపాయలు సంపాదిస్తోందని తెలిపింది. కానీ, ఈ ఆస్తులకు అసలు వారసులమైన తమకు ఎలాంటి పరిహారం చెల్లించడం లేదని లేఖలో పేర్కొంది. ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపింది.

  గతంలోని హిందూ రాజ్యాల వారసులు వందలాది మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందడం లేదు. కానీ, ప్రభుత్వాలు నిరంకుశ మొఘల్ వారసులను మాత్రం కూర్చోబెట్టి సాకుతున్నాయి. ఏ రాజ్యాంగ ప్రాతిపదికన ప్రభుత్వం వారికి పెన్షన్లు ఇస్తోందన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

  నిజానికి, ఎర్రకోట మొఘలుల సొత్తు కాదు. భారత రాజధాని డిల్లీలో ఉన్నఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసంగా ఉండేది, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 1857 తరువాత బ్రిటిష్ వారు దానిని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. భారతదేశంలో మొఘల్ పాలకుడు షాజహాన్ తన పదవీకాలంలో అనగా.. సాధారణ శకం 1639 నుండి 1648 మధ్య కాలంలో ఉస్తాద్ అహ్మద్ లాహౌరీ ద్వారా ఈ రాజభవనాన్ని నిర్మించాడని అందరూ అనుకుంటారు. కానీ, వారు చేసినది కొన్ని మార్పులు మాత్రమే. మొఘలులు భారతదేశంలోకి ప్రవేశించక ముందే ఈ కోట ఉంది.

  ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఎర్రకోట లోపల ఒక రాతి పలకను ఉంచారు. దానిపై ఈ కోటను సాధారణ శకం 1639 నుండి 1648 వరకు నిర్మించినట్లు ప్రకటించారు. కానీ, 1628లో షాజహాన్ తన రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినట్టు చరిత్ర చెబుతోంది. ఇందుకు అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ఆక్స్ ఫర్డ్ బోడ్లియన్ లైబ్రరీలో భద్రపరచబడిన ఈ పెయింటింగే అందుకు నిదర్శనం. షాజహాన్ పరిపాలన సమయంలో 1628 లో షాజాహాన్ భారత రాజదాని కలకత్తా నుండి డిల్లీ ఎర్రకోట కు మార్చినట్లు ఈ పెయింటింగ్ స్పష్టం చేస్తోంది. అంటే షాజహాన్ కంటే చాలా ముందు ఈ కోట ఉన్నట్టే కదా..! అలాంటప్పుడు ఎర్రకోట మొఘల్ రాజులది ఎలా అవుతుంది..?

  అంతేకాదు, ఎర్రకోటను హిందూ రాజులు నిర్మించారనడానికి అనేక ఆధారాలున్నాయి. నిజానికి, ఎర్రకోటను నిర్మించింది రాజా అనంగ్ పాల్. ఎర్రకోట ఖాస్ మహల్ లోని ప్రధాన హాలులో ఆయన చిహ్నం ఇప్పటికీ వుంది. అంతేకాదు, ఎర్రకోట గోడలపై వున్న ఒక జత కత్తులు, పవిత్రమైన హిందూ కలశము, ఒక తామర పువ్వు.. పురాతన భారతీయ నిర్మాణశైలి కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ద్వాపరయుగానికి చెందిన తులాభారం యొక్క ప్రమాణాలు ఉన్నాయి వున్నాయి. భారత పాలక రాజవంశ సంతతికి చెందిన సూర్వవంశానికి చిహ్నంగా సూర్యుని యొక్క చిత్రం కూడా మనకు కనిపిస్తుంది. జత కత్తులకు అటూ ఇటూ హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించే రెండు చిన్న శంఖాలు ఉన్నాయి. ఎడమ, కుడి మూలల్లో పెద్ద శంఖాలు చూడవచ్చు. హిందూ రాజా అనంగ్ పాల్ ఎర్రకోటను నిర్మించాడని చెప్పడానికి ఇన్ని ఆధారాలున్నప్పటికీ.. చరిత్రను వక్రీకరించారు.

  గత పాలకులు అసత్య ప్రచారం చేశారు. రెండు కత్తులను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఇస్లామిక్ నెలవంకగా వక్రీకరించారు. కానీ, కొంచెం పరిశీలించి చూస్తే మనకే వాస్తవాలు తెలుస్తాయి. పవిత్ర హిందూ కలశం కూడా గుర్తించలేని మూర్కులు.. మన చరిత్రను రాయడం జరిగింది. హిందూ కలశం మీద ఉన్న తామర పువ్వు రాజ సంపదను సూచిస్తుంది. భారతదేశంలో ధర్మానికి సంభందించి తులాభారం న్యాయం యొక్క చిహ్నం. ఇవన్నీ షాజహాన్ ఎర్రకోటను నిర్మించాడనే వాదన తప్పని రుజువు చేస్తున్నాయి. మొఘలులు ఎర్రకోటను కేవలం రాజమహల్ గా వాడుకున్నారు. ఆ క్రమంలో కొన్ని మార్పులు చేసుకున్నారంతే. మరి, హిందూ రాజు నిర్మించిన ఎర్రకోటను తమ ఆస్తి అంటూ మొఘలు వారసులు కోర్టుకెక్కినా.. కాదని నిరోధించలేని స్థితిలో మనం ఉండటం నిజంగా దౌర్భాగ్యం.

  వామపక్ష ఉదారవాదులు, కుహనా లౌకికవాదులు.. మొఘలులు భారతదేశాన్ని సుసంపన్నం చేశారంటూ.. తరతరాలుగా హిందువుల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేశారు. నయవంచకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాస్తవాలు మారవు కదా..! మొఘలుల పాలనలో భారత దేశ సంపద కొల్లగొట్టబడింది అక్షర సత్యం. నిరంకుశ మొఘల్ రాజులు లక్షలాది హిందూ దేవాలయాలను దోచుకున్నారు. హిందూ విశ్వవిద్యాలయాలు, సంస్థలను లూటీ చేశారు. అసంఖ్యాక హిందువులను హింసించారు. వెళ్తూ వెళ్లూ ట్రిలియన్ల డాలర్ల సంపదను వారి స్వస్థలాలకు తీసుకువెళ్లారు. ఇంత చేసినా ప్రభుత్వాలు ఇంకా వారిని, వారిని, వారి వారసులను కీర్తిస్తూనేవున్నాయి.

  మొఘల్ వారసులను కీర్తించడంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. మైనార్టీ ఓట్లే పరమావధిగా రాజకీయాలు నడుపుతున్న దీదీ.. వారిని నెత్తిన మోస్తున్నారు. హిందువుల పట్ల దశాబ్దాలుగా విషం చిమ్ముతూనేవున్నారు. 2004లో మమతా బెనర్జీ స్వయంగా సుల్తానా బేగం ఇంటికి వెళ్లి 50 వేల రూపాయల డబ్బును సాయం కింద ఇచ్చేశారు. ఆమె మనవరాలు రోషన్ అరాకు గ్రూప్ ‘డి’ రైల్వే ఉద్యోగాన్ని కట్టబెట్టారు. దీంతో మమతా బెనర్జీని దేవతగా భావించి కీర్తించారు సుల్తానా బేగం. బహదూర్ షా జాఫర్ కుటుంబాన్ని ఆదరిస్తున్నందకు కృతజ్ఞతలు తెలిపారు.

  దీదీ ఎంతో దయగల వ్యక్తి అని.. తాను ఆమె మాటలను విశ్వసించానని అన్నారు సుల్తానా బేగం. గడిచిన 150 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు కూడా పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు సరైన చర్య తీసుకోలేదని తెలిపారు. బహదూర్ షా జాఫర్ కుటుంబాన్ని చేరదీసినందుకు దీదీకి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.

  ఏదేమైనప్పటికీ, హిందువులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. హిందువుల సంపదను దోచుకుని, అనేక మందిని ఊచకోత కోసి, లక్షలాది దేవాలయాలను ధ్వంసం చేసిన మొఘల్స్ క్రూరత్వాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. హిందువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన మొఘల్స్ నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ మొఘల్స్ ను కీర్తిస్తూ బోధించిన పాఠాల వెనుక కుట్రలను గుర్తిస్తున్నారు. వాస్తవాలను గ్రహిస్తున్నారు. అయినా, ఇప్పటికీ మొఘల్ వారసులు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. ఈ దేశం తిండి తింటూ కూడా దేశం పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. మాతృభూమికి ద్రోహం చేస్తున్నారు. మొఘల్ వారసులు భారత దేశాన్ని ఎప్పుడైతే మాతృభూమిగా గుర్తిస్తారో, అప్పుడే లౌకివాదానికి నిజమైన అర్థం నిర్వచించబడుతుంది.

  Trending Stories

  Related Stories