National

గర్భంతో ఉన్న గోవులను తస్కరించి.. వధించి

తమిళనాడు రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న గోవులను తస్కరించి.. వాటిని వధించారు. ఈ విషయం తెలిసి హిందూ బంధువులు ఎంతగానో బాధను వ్యక్తం చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ వారిపై కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

అరి అనే పేద రైతుకు గుడియాత్తంలో రెండు గోవులు ఉన్నాయి. అవి గర్భంతో ఉన్నాయి. ఆదివారం నుండి కనిపించకుండా పోయిన ఆ గోవులను చంపేశారు. అరి తన ఇంటి దగ్గర ఉన్న గోవులను కట్టేసి ఉండగా ఎవరో వాటిని తెంపుకుని వెళ్లిపోయారు. అయితే అప్పటికే వర్షం పడి ఉండడంతో ఆవుల అడుగులను వెతుక్కుంటూ వెళ్ళాడు. క్వైద్-ఇ-మిల్లత్ నగర్ లో అతడి ఆవులను చంపేసి వేలాడతీయడాన్ని చూసి అరి తట్టుకోలేకపోయాడు. అరి తన గ్రామస్థులతో కలిసి దొంగతనం చేసిన వారిని నిలదీశారు. గర్భంతో ఉన్న గోవులను చంపడానికి మీకు మనసెలా వచ్చింది అంటూ ప్రశ్నించాడు. చిత్తూరు హైవే పై రాస్తా రోకో నిర్వహించారు. గంటపాటూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధరన్, టూ టౌన్ పోలీసు ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్, తాలూకా ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్లు సిలంబర్సన్, శివచంద్రన్ లు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేస్తామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు. అరి ఈ ఘటనపై గుడియాత్తం తాలూకా పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసాడు. దీంతో సురేష్ బాబు ఈ ఘటనపై దర్యాప్తు చేయగా.. ముబారక్ అలీ(28) అతడి సోదరుడు రఫీక్(36) ఈ ఘటనకు పాల్పడిందిగా గుర్తించారు. వీరి తండ్రి చిత్తూరు గేట్ ఏరియా ప్రాంతంలోని ఓ పోలీసు ఆఫీసర్ అని గుర్తించారు. వీరికి కబేళా షాపు కూడా ఉందని పోలీసులు తెలుసుకున్నారు. వీరే ఆ ఆవులను దొంగిలించి.. వధించారని గుర్తించారు. ముబారక్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రఫీక్ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వీరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 5 =

Back to top button