National

రాజ్యసభ నుంచి అసెంబ్లీ బరిలోకి స్వపన్ దాస్ గుప్తా

బెంగాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎంపీ స్వపన్ దాస్ గుప్తాను ప్రకటించింది. అయితే దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం…నామినేటెడ్ ఎంపీలు రాజకీయ పార్టీల్లో చేరకూడదని పేర్కొంది. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన  ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీల్లో చేరితే వారిని అనర్హులుగా ప్రకటించాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చెబుతోందని… తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

దీంతో తన అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం కావడంతో… స్వపన్ దాస్ గుప్తా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2016లో జర్నలిజం రంగం నుంచి భారత రాష్ట్ట్రపతి ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత స్వపన్ దాస్ గుప్తా తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

బెంగాల్ లో రాజకీయ హింసాకాండ పెరిగిపోయిందని…వీటికి చరమగీతం పాడాలంటే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందేనని స్వపన్ దాస్ గుప్తా అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ తీరు కారణంగా ఉపాధి అవకాశాలు లేక ప్రతిభావంతులైన బెంగాల్ యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని… ఇప్పటికైనా బెంగాల్ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 4 =

Back to top button