ప్రముఖ సినీ హీరో కృష్ణ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సూపర్ స్టార్…సాంఘిక, పౌరాణిక చలనచిత్రాలలో నటించి తెలుగు ప్రజలను మెప్పించారన్నారు. జేమ్స్ బాండ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేసిన కృష్ణ మరణం.. తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు.