More

    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద విధ్వంసం

    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారని ఆరోపిస్తూ.. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ నిజామాబాద్లో ఉన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ధర్మపురి అర్వింద్.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధమున్న కవితకు బీజేపీలో చోటు లేదని అన్నారు. ఆమెను పార్టీలోకి తీసుకొస్తామన్న వారిని కూడా ఉపేక్షించమని చెప్పారు. అలా తీసుకొచ్చే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను డిమాండ్ చేస్తానని అర్వింద్ చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కూడా కవిత టచ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు.

    Trending Stories

    Related Stories