నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.. చంద్రుడిపై పాదం మోపిన మొదటి మనిషి..! అపోలో 11 మిషన్ సమయంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై వెళ్లి మట్టిని కూడా సేకరించారు. ఇది వేలంలో 504,375 డాలర్లకు విక్రయించబడింది. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన స్పేస్ హిస్టరీ సేల్‌లో భాగంగా బోన్‌హామ్స్ వేలం పాట నిర్వాహకులు మూన్ డస్ట్‌ను విక్రయించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రునిపై మొదటి అడుగులు వేసిన వెంటనే దుమ్మును సేకరించాడు. బోన్‌హామ్స్ వేలంలో $800,000 నుండి $1.2 మిలియన్ల వరకు పలకవచ్చని భావించింది. అయితే వారు అనుకున్న ధరకు మూన్ డస్ట్ అమ్ముడుపోలేదు.
మూన్ డస్ట్ ధర ఆశ్చర్యకరంగా తక్కువకే అమ్మినట్లు చెప్పొచ్చు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ద్వారా ధూళి నమూనాలు కూడా ప్రామాణికమైనవిగా నిర్ధారించబడ్డాయి. అపోలో 11లో డస్ట్ ప్యాక్ చేయబడిన లూనార్ బ్యాగ్ 2017లో $1.8 మిలియన్లకు విక్రయించబడింది. మూన్ డస్ట్ ఆక్షన్ హౌస్‌కి తీసుకురావడానికి చాలా సమయమే పట్టింది. మూన్ డస్ట్ హక్కుల కోసం NASA కోర్టుకు కూడా వెళ్ళింది. మీడియా అవుట్‌లెట్ ప్రకారంగి 2015లో, మిచిగాన్‌కు చెందిన న్యాయవాది నాన్సీ లీ కార్ల్‌సన్‌కు ఈ ధూళి విక్రయించబడింది. 995 డాలర్లకు ఆమె కొనుక్కున్నారు. “flown lunar sample return bag with lunar dust” అంటూ యూఎస్ మార్షల్ వేలంపాటలో ఆమె కొనుక్కున్నారు. ఆ తర్వాత ఆమె ఈ ధూళికి సంబంధించిన మరింత సమాచారం కోసం పరిశోధకుల దగ్గరకు పంపించింది. మూన్ డస్ట్ అని ఆమె భావించి.. బ్యాగ్‌లోనిది ధృవీకరించాలనే ఆశతో ఆమె వాటిని US స్పేస్ ఏజెన్సీకి పంపింది. NASA అపోలో 11తో దాని సంబంధాలను గ్రహించి దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. US-ఆధారిత న్యాయవాది 2016లో తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నందుకు వెంటనే NASAపై దావా వేసి విజయం సాధించారు. నాసా విలువైన నమూనాలను ఎలా పోగొట్టుకుందో నేటికీ అస్పష్టంగా ఉంది. కానీ 2002లో కాన్సాస్‌లోని స్పేస్ మ్యూజియం సహ వ్యవస్థాపకుడు.. అరుదైన కళాఖండాలను విక్రయించినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు.