National

ఆటో డ్రైవర్ పై పగబట్టిన కోతి.. ఇంతకూ అతడు దానికి చేసిన తప్పేమిటంటే

సాధారణంగా కోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు.. ఏవైనా వస్తువులు దొరికితే వాటిని పీకి.. నాశనం చేసే దాకా వదలవు. ఆ కోతుల బెడద తప్పించడానికి ఎన్నో ఊళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా కోతులను బెదిరించి పంపించేయడానికి చాలానే కష్టపడుతూ ఉంటారు. ఇక అంతకు మించి అవి చేసే అల్లర్లను భరించలేక.. పట్టుకొని అడవుల్లోకి వదిలేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఓ కోతిని ఓ వ్యక్తి పట్టించడమే.. అతడు చేసిన పెద్ద పొరపాటు అయింది. ఆ మనిషిని గుర్తు పెట్టుకున్న ఆ వానరం 22 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి మరీ కొరికింది. ఆ కోతి చెవికి ఉన్న గుర్తును చూసి ఆ కోతే పగబట్టి మరీ సదరు వ్యక్తిని కొరికిందని గ్రామస్తులంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పాములు పగబట్టడం చూశాం కానీ.. కోతి ఇలా పగబట్టి దాడి చేస్తుందని ఎవరూ ఊహించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Monkey Revenge

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగలూర్‌ జిల్లాలోని కొట్టిఘెహరా అనే గ్రామంలో అయిదు సంవత్సరాల వయసున్న ఓ మగకోతి గ్రామస్థులను ఎన్నో ఇబ్బందులు పెట్టేది. ఇటీవల పాఠశాలలు తెరిచిన సమయంలో స్కూలు పిల్లలపై దాడులకు పాల్పడింది. దీంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్‌ 16న గ్రామానికి వచ్చిన అధికారులకు అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ జగదీశ్‌ కోతిని పట్టుకోవడానికి సాయం చేశాడు. చాలా కష్టం మీద ఆ కోతిని అధికారులు పట్టుకున్నారు. తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న ఆ వానరం వెంటనే అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్‌ వెంట పడింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. ఆటో టాప్‌, సీట్లను చించి జగదీశ్‌పై దాడి చేసింది. చెవులను కొరికి తన కోపాన్ని తీర్చుకుంది. ఇక వెంటనే అధికారులు ఆ వానరాన్ని పట్టుకొని ఊరికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో విడిచిపెట్టారు. అయితే కోతి ఏమని అనుకుందో కానీ.. ఓ లారీ మీద ఎక్కి మళ్లీ గ్రామానికి చేరుకుంది. జగదీశ్‌ ఎక్కడ ఉన్నాడా అని ఊరంతా తిరిగింది. కోతి చెవిమీద ఉన్న గుర్తును గమనించి గ్రామస్థులు ఆ వానరం ముందుదేనని గుర్తించారు. ఊళ్లోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్‌కు చెప్పడంతో అతడిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈ కోతి మళ్లీ తనను ఏమి చేస్తుందోనని జగదీశ్ భయపడుతూ ఉన్నారు.

Monkey Revenge
Monkey Revenge

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + 5 =

Back to top button