More

  లవ్ జీహాద్.. హిందూ యువతిని మతం మార్పించే ప్రయత్నం చేసిన మోహిబ్ పఠాన్ అరెస్ట్

  హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాలని ప్రయత్నించినా ముగ్గురిపై గుజరాత్ పోలీసులు కేసును నమోదు చేశారు. గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ (సవరణ) చట్టం, 2021 ప్రకారం అరెస్టులు చేశారు. గుజరాత్ ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి గుజరాత్ పోలీసులు ఈ చట్టం ప్రకారం నమోదు చేసిన మూడవ కేసు ఇది.

  తన భర్త మోహిబ్ పఠాన్ తన మతాన్ని బలవంతంగా మార్చుతున్నాడని ఆరోపిస్తూ 23 ఏళ్ల మహిళ వడోదరలోని ఫతేగంజ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. 2018 లో ఆమె తన ట్యూషన్ క్లాసులకు హాజరైనప్పుడు ఆమెను మొదటిసారి కలిశానని ఫిర్యాదుదారుడు పోలీసులకు చెప్పాడు. వారిద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడటం ప్రారంభించారు. మనమిద్దరం పెళ్లి చేసుకున్నాక ఎవరి మత సంప్రదాయాలు.. వాళ్లు పాటించవచ్చని పఠాన్ ఆమెను నమ్మబలికించాడు. 2020 ఆగష్టులో ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. చానీ ప్రాంతంలో ఆమె పఠాన్ తో కలిసి నివసిస్తూ ఉంది. తన ఫిర్యాదులో, పఠాన్ అసహజమైన లైంగిక చర్యకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమె అందుకు అంగీకరించడానికి నిరాకరిస్తే ఆమెను కొట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. వివాహం జరిగిన ఒక నెల తరువాత, పఠాన్ ఆమె పేరును మార్చుకోమని బలవంతం చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. పఠాన్ ఒక ఖాజీని పిలిచి ఇస్లాం ప్రకారం వివాహ కార్యక్రమాలు చేయించాడు.

  ఆమెను ఇస్లాం మతంలోకి మార్చడానికి బలవంతం.. హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం

  పఠాన్ తనను తన మతం ప్రకారం ప్రార్థన చేయడానికి కూడా అనుమతించలేదని బాధితురాలు తెలిపింది. తాను తెచ్చిన దేవతల విగ్రహాలను విసిరేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఫిర్యాదులో పఠాన్ తండ్రి ఇంతియాజ్, పఠాన్ అన్నయ్య మొహ్సిన్ పఠాన్ లు కూడా తనను వేధించారని బాధితురాలు తెలిపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పఠాన్ అన్నయ్య మొహ్సిన్ తనను వేధించడానికి ప్రయత్నించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. ఈ సంఘటన గురించి తన భర్తకు చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోలేదని వాపోయింది. తమ బిడ్డకు శివ అని పేరు పెట్టడంతో భర్త తనను కొట్టాడని తెలిపింది. పఠాన్ బుధవారం నాడు మళ్ళీ ఆమెపై దాడి చేయడంతో గత్యంతరం లేక ఆ మహిళ ఇంటిని వదిలి పోలీసులను సంప్రదించింది.

  ఫిర్యాదు స్వీకరించాక ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో మరెవరైనా ఉన్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వడోదర పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపిసి సెక్షన్ 354, 498-ఎ, అసహజ లైంగిక చర్యకు సెక్షన్ 377 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎసిపి పరేష్ భేసానియా తెలిపారు.

  గుజరాత్ ప్రభుత్వం ఇటీవలే గుజరాత్ మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు 2021 ను అసెంబ్లీలో అమలు చేసింది. “వివాహం ద్వారా బలవంతంగా మార్పిడి” చేయడాన్ని నిషేధించింది. గుజరాత్ అసెంబ్లీ ఇటీవల ముగిసిన బడ్జెట్ సెషన్లో ఈ చట్టం ఆమోదించబడింది గవర్నర్ ఆచార్య దేవ్రాత్ ఆమోదించారు. గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ యాక్ట్ 2021, ప్రకారం వివాహం ద్వారా బలవంతంగా మత మార్పిడి కోసం ఏదైనా వ్యక్తి లేదా సంస్థపై కఠినమైన శిక్షా చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం జూన్ 15 నుండి అమల్లోకి వచ్చింది.

  గుజరాత్ పోలీసులు ఇప్పటికే రెండు కేసుల నమోదు
  కొత్తగా తీసుకుని వచ్చిన చట్టం కారణంగా రెండు వేర్వేరు కేసులలో గుజరాత్ పోలీసులు ఇప్పటికే రెండు అరెస్టులు చేశారు. జూన్ 19 న, గుజరాత్ పోలీసులు సవరించిన చట్టం ప్రకారం మొదటి కేసును నమోదు చేశారు. వడోదరలోని తార్సాలి ప్రాంతంలో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురితో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. 24 ఏళ్ల మహిళను సమీర్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి క్రైస్తవునిగా నటిస్తూ అమ్మాయిని మోసం చేసినట్లు తెలియడంతో గుజరాత్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వివాహం తరువాత ఆమెకు ఆధునిక జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఆమెను వలలోకి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఒక హోటల్ లోనూ మరో నిందితుడి నివాసంలోనూ బాధితురాలిపై నాలుగుసార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. నిందితుడు తనను వివాహం చేసుకుని, తరువాత ఇస్లాం మతంలోకి మారమని బ్లాక్ మెయిల్ చేయడానికి మహిళ పోలీసులకు తెలిపింది. సన్నిహిత ఫోటోలను ఇతరులతో పంచుకున్నాడని బాధితురాలు వడోదర పోలీసులకు తెలిపింది.

  మరో కేసులో.. 19 ఏళ్ల జైన యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు ఇమ్రాన్ అన్సారీ అనే 23 ఏళ్ల వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆమెతో ‘శృంగార సంబంధం’ ఏర్పరచుకొని బాధితురాలిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్సారీ జూన్ 10 న బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఇంటి నుంచి తప్పిపోయిన తరువాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబం తప్పిపోయిన ఫిర్యాదు చేయడమే కాకుండా ఆమె అదృశ్యం వెనుక అన్సారీ ఉన్నాడని పోలీసులకు తెలిపారు. నిందితుడు బాధితురాలిని రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు, తరువాత మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లాడు. నిందితుడు బాధితురాలిని కూడా లైంగిక దోపిడీకి గురిచేసినట్లు పోలీసులు తెలిపారు.

  Trending Stories

  Related Stories