సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు మరణించారు. 63 సంవత్సరాల వయసులో రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంగస్వామినాయుడు తిరుపతిలో నివసిస్తున్నారు. మోహన్ బాబు, ఆయన కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే వారు. నేడు తిరుపతిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
మోహన్ బాబు సోదరుడు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 9 గంటలకు తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రంగస్వామి మృతితో మోహన్ బాబు కుటుంబం, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
