More

    బుమ్రా స్థానంలో సిరాజ్

    ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడికి విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. యూఏఈలో మోకాలి గాయానికి గురైన రవీంద్ర జడేజా ఇప్పటికే వరల్డ్ కప్ కు దూరం కాగా, ఇప్పుడు బుమ్రా కూడా దూరమయ్యాడు.

    బుమ్రా స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.

    బుమ్రా విషయంలో బీసీసీఐ తొందరపాటు నిర్ణయమే అతడిని ప్రపంచకప్ కు దూరం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. జులైలో ఇంగ్లండ్‌ పర్యటనలో వెన్ను గాయానికి గురైన బుమ్రా ఆసియా కప్‌కు దూరంగా ఉన్నాడు. దాని నుంచి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా రెండో మ్యాచ్‌లో రెండు ఓవర్లు, మూడో టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఈలోపు గాయం తిరగబెట్టింది. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే బుమ్రా గాయం తిరగబెట్టడంతో తను పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకొచ్చారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రపంచ కప్‌ నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ విషయంలో బీసీసీఐ తొందరపడి తప్పు చేసిందని విమర్శలు వస్తున్నాయి. బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరం లేకపోయినా.. పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

    Trending Stories

    Related Stories