దీదీ అంటే అక్క అని అర్థం. మమతా బెనర్జీని ఆమె మద్దతు దారులు దీదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మమతా బెనర్జీ కూడా వారితో అలా కలిసిపోయారు. ఆ క్రమంలో దేశం మొత్తం ఆమెను దీదీ అని పిలుస్తోంది. ప్రధాని మోదీ కూడా దీదీ అని పిలుస్తూనే ఆయనది ప్రత్యర్థి పార్టీ కాబట్టి… ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు కామన్‌గా చేస్తున్నారు. అంతే తప్ప… ఆమెను కించపరిచే ఉద్దేశంతో కాదు.
ప్రధాని మోదీ.. ప్రసంగం అంటేనే.. అందులో ఎన్నో ఛలోక్తులు, విపక్షాలకు చురకలతో కూడిన విసుర్లు, నివురుగప్పే నిజాలు ఉంటాయి. అందులోనూ ఎన్నికల వేళ ఆయన మాట ఒక్కో తూటా వంటిదని విపక్షనేతలే అంగీకరించే మాట. అన్నిటికీ మించి వ్యంగోక్తులు, వాటిని పలికే తీరుతో జనాల్లోకి అనుకున్నది నేరుగా చేరవేయగల సామర్ధ్యం మోదీ సొంతం. క్లారిటీ, ప్యూరిటీ ఆయర మాటలో జాలువారుతాయని బీజేపీ శ్రేణులు గొప్పగా చెప్పుకునే మాట. ఇదలా ఉంటే..
8 దశల్లో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్… హోరాహోరీ ప్రచారం నువ్వా నేనా సై అనే రేంజ్ లో సాగుతోంది.. ఈ క్రమంలో… మూడో దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… “దీదీ ఓ దీదీ” అనే స్వరం అందుకోవడం ఇప్పుడు వైరల్ గా మారిన విషయమైంది.
ఒక స్పీచ్ లో మాటకు ముందు… మాటకు తర్వాత… దీదీ ఓ దీదీ అంటూ… తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. దాంతో దీదీ ఓ దీదీ అనే ట్యాగ్ లైన్ దూసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి బీజేపీ నేతలంతా ఇదే వాయిస్ అందుకున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా… దీదీ ఓ దీదీ అంటూ… మమతకు మంటెక్కేలా విమర్శలు చేస్తున్నారు.
దీదీ అంటే అక్క అని అర్థం. మమతా బెనర్జీని ఆమె మద్దతు దారులు దీదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మమతా బెనర్జీ కూడా వారితో అలా కలిసిపోయారు. ఆ క్రమంలో దేశం మొత్తం ఆమెను దీదీ అని పిలుస్తోంది. ప్రధాని మోదీ కూడా దీదీ అని పిలుస్తూనే ఆయనది ప్రత్యర్థి పార్టీ కాబట్టి… ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు కామన్‌గా చేస్తున్నారు. అంతే తప్ప… ఆమెను కించపరిచే ఉద్దేశంతో కాదు.
294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 4 దశలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.
ఇక మోదీ.. దీదీ ఓ దీదీ వైరల్ వీడియోను మీరు చూసెయ్యండి.