Telugu States

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా భారతప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు.. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌దైన‌ సంస్కృతితో, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వంతో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు.


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ వెంక‌య్య నాయుడు ట్వీట్ చేశారు.

కొవిడ్ కారణంగా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణయించింది. పలువురు నేత‌లు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, ప‌లు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణలను చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైద‌రాబాద్‌లోని త‌న అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద‌యం గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ‌ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్క‌రిస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీలో స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాసరెడ్డి, శాసన‌మండ‌లిలో ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అమరవీరులకు తెలంగాణ నేత‌లు నివాళులు అర్పిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 8 =

Back to top button