ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం వైఎస్.జగన్ ఈనెల 12న విశాఖ వస్తున్న సందర్భంగా…. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదీప్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం నగరంలో కోట్లాది రూపాయలతో ప్రధానమంత్రి మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో చేస్తున్నారన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ రాకతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభను విజయవంత చేయాలని కోరారు.