More

    మోదీ ప్రభుత్వ మంత్రాంగానికి పాక్ , చైనాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందా?

    శత్రువును జయించాలంటే యుద్ధమే చేయనక్కర్లేదు.., అవసరమైతే కూటనీతిని కూడా ప్రయోగించాలంటారు ఆచార్య చాణక్యుడు.! యుద్ధానికి కంటే ముందే.., శత్రువు యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీస్తే చాలూ…, యుద్ధం గెలిచినట్లేనంటారు.!
    అందు కోసం భయంకరమైన భీతి గొలిపే ఆయుధ సంపత్తిని, శత్రువు ఎదుట ప్రదర్శిస్తే చాలూ అంటారు ఇప్పటి ఆధునిక రక్షణ రంగ నిపుణులు.!
    ప్రస్తుతం మన దేశానికి ప్రధాన శత్రు దేశాల్లో ఒకటి పాకిస్తాన్ అయితే.., మరొకటి కమ్యూనిస్టు చైనా దేశం.! ఈ రెండు దేశాలు కూడా ఇటీవలి కాలంలో రక్షణ సంబంధాల పరంగా పటిష్ఠంగా కనిపిస్తున్నాయి.! అయితే ఈ రెండు శత్రు దేశాలు ఇలా పరస్పరం సహకరించుకోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్టిన భయమే కారణమంటారు రక్షణ రంగ నిపుణులు.!
    నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అంటే అర్థమే మారిపోయిందని అంటారు. అంతకు ముందు భారత్ అనగానే అదోక సాప్ట్ కార్నర్ దేశం… మెతక వైఖరి కలిగిన దేశం.! కానీ నరేంద్రమోదీ రాకతో భారత్ అంటే ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనేవాలే దేశ్ హై అనే విధంగా మారిపోయింది.
    నార్త్ ఈస్ట్ లోని వేర్పాటువాద మూకలను ఏరివేయడంలో భాగంగా మయన్మార్ అడవుల్లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్టయిక్స్ చైనాకు గుబులు పుట్టించింది. ఇంకా ఎల్ఓసీ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి, ఉగ్రశిబిరాలపై మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్, అలాగే బాలాకోట్ పై వైమానిక దాడులు., పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టించాయి.
    దీంతో భారత ప్రజల్లో కూడా మోదీ ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఏదో ఒక రోజు పాక్ అక్రమిత కశ్మీర్ భూభాగం మొత్తం మనదవుతుందనే ఆశలు చిగురించాయి.
    చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పీవోకేలో భారీగా పెట్టుబడులు పెట్టిన డ్రాగన్ కూడా ఈ విషయాన్ని పసిగట్టింది.
    ఈ కారణాంగానే భారత వైమానిక దాడుల నుంచి.., పాకిస్తాన్ ను కాపాడేందుకు చైనానే రంగంలోకి దిగిందని కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలో…, పాక్ గగనతలంలోకి ప్రవేశించే శత్రు దేశాల యుద్ధ విమానాలు కూల్చివేసేలా, హెచ్ క్యూ 9 పీ హైమ్యాడ్స్ క్షిపణులను డ్రాగన్ చైనా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్ కు సరఫరా చేసింది.!
    అలాగే చైనా ఆక్రమిత షింజియాంగ్ ప్రావిన్స్ లోనూ హెచ్ క్యూ 9 క్షిపణులను మోహరించింది. ఈ క్షిపణులను రష్యా మేడ్ ఎస్-300 కు నకలుగా పేర్కొంటున్నారు కొంతమంది రక్షణ రంగ నిపుణులు.! రష్యా నుంచి ఎస్ -300 క్షిపణులను కొనుగోలు చేసిన చైనా…, ఆ తర్వాత వీటిని కాపీ కొట్టి హెచ్ క్యూ 9 పేరుతో తామే దేశీయంగా రూపొందించినట్లుగా బిల్డప్ ఇస్తోందని అంటున్నారు. 100 కిలోమీటర్లకు అవతల ఉన్న శత్రు విమానాలను, క్షిపణులను ముందే పసిగట్టి ఎదురుదాడి జరిపే సత్తా ఈ హెచ్ క్యూ 9 క్షిపణి వ్యవస్థకు ఉందని చైనా చెప్పుకుంటోంది.! భారత్ కు వ్యతిరేకంగా.., సైనికపరంగా, పాకిస్తాన్ ను బలోపేతం చేసేందుకే…, పీవోకే సరిహద్దులతోపాటు.., పశ్చిమ సరిహద్దుల్లో వీటిని మోహరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చైనా మేడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి, టెక్నాలజీపరంగా అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.
    పాకిస్తాన్ మోహరించిన ఈ హెచ్ క్యూ 9 క్షిపణి వ్యవస్థను పూర్తిస్థాయిలో కౌంటర్ చేయడానికి భారత్ కూడా తనదైన వ్యూహాలను మొదలు పెట్టింది. రష్యాతో ఎప్పటి నుంచే పెండింగ్ లో ఉన్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు శరవేగంగా పావులు కదుపుతోంది. దీర్ఘకాలిక భద్రత వ్యూహంలో భాగంగా ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దేశానికి అత్యవసరమని అటు రక్షణ రంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.
    నిజానికి… 2019లోనే భారత్ , రష్యాల మధ్య ఎస్ -400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించిన సంతకాలు జరిగాయి.! ఒప్పందంలో భాగంగా రష్యా.., భారత్ కు ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను అందించాల్సి ఉంది.! ఈ వ్యవస్థ కోసం భారత్… రష్యాకు దాదాపు 5.4 బిలియన్ డాలర్లను చెల్లిస్తోంది. అయితే అమెరికాకు ఈ డిల్ ఇష్టం లేదు.
    అమెరికా కూడా భారత్ కు పేట్రియాట్ , థాడ్ వంటి క్షిపణులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ… భారత్ మాత్రం రష్యా నుంచి ఎస్-400 కొనుగోలుకే మొగ్గుచూపింది.
    బహుళవిధ రాడార్ , శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి క్షణాల వ్యవధిలో ఎదురుదాడి చేసే మెకానిజం, విమాన విధ్వంసంక క్షిపణులు, కంట్రోల్ సెంటర్ వంటివి ఈ ఎస్-400 లో అంతర్భాగాలుగా ఉన్నాయి.!
    ఈ వ్యవస్థ మూడు రకాల క్షిపణులను ప్రయోగించగలదు. శత్రు విమానాలను, పైలట్‌ రహిత యూఏవీలను, క్షిపణులను తుత్తునియలు చేస్తుంది. శత్రు విమానాలు, క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తున, 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి ఎదురుదాడి జరపగలదు.! ఇది ఏకకాలంలో 30 శత్రు విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కోగలదు.!
    అంతేకాదు ఈ క్షిపణి వ్యవస్థను రోడ్డు మార్గం ద్వారా సరిహద్దుల్లోని మూలకైనా సులభంగా తీసుకుని వెళ్లవచ్చు.! కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే శత్రు దేశాలపై ఎదురుదాడికి సిద్ధం చేయవచ్చును.! సైన్యానికే కాకుండా, వాయు, నౌక సేనలు.. మూడింటికి గగనతల రక్షణ వ్యవస్థగా ఎస్ -400 వ్యవస్థను మనం సలభంగా వాడుకోవచ్చు.
    అయితే ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్… రష్యాతో ఒప్పందం చేసుకున్న ఏడాదే…, అమెరికా కూడా… తమ ప్రత్యర్థి దేశాలపై ఆర్థిక ఆంక్షలను విధించేలా Countering America’s Adversaries Through Sanctions Act-CAATSA చట్టాన్ని తెరపైకి తెచ్చింది.! ఈ చట్టం రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలకు చెందిన రక్షణోత్పత్తుల సంస్థల నుంచి ఆయుధాలు కొనుగోలు వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికాకు అవకాశం కల్పిస్తుంది.!
    అమెరికా… కాట్సా చట్టం తెరపైకి తెవడంతో దాని ప్రభావం ఎస్-400 కొనుగోలపైనా కూడా పడింది. దీంతో ఈ డీల్ ఇనాళ్ళపాటు ఆలస్యం అవుతూ వస్తోంది.
    ప్రస్తుతం… అటు పాకిస్తాన్, ఇటు చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతోపాటు, భారత్ టార్గెట్ గా… హెచ్ క్యూ 9 క్షిపణుల మోహరింపు వార్తల నేపథ్యంలో, ఇప్పుడు ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థ భారత్ కు అనివార్యంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించాలని అమెరికాపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తోంది.!
    దీనిపై భారత విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ కూడా… అమెరికాతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. తనదైన మంత్రాంగం ద్వారా అమెరికాకు అసలు తత్వం బోధపడేలా చేశారు. దీంతో దిగివచ్చిన అమెరికా చివరకు… భారత్ పై కాట్సా ఆంక్షలు విధించకపోవచ్చునని సంకేతాలు ఇవ్వాల్సివచ్చింది.
    ఇప్పుడు అమెరికా సెనేటర్లు… మార్క్ వార్నర్, జాన్ కార్నిన్ కూడా రంగంలోకి దిగి భారత్ పక్షాన మాట్లాడుతున్నారు. మరికొంతమంది సెనెటర్లును సైతం మోటివెట్ చేస్తున్నారు.
    భారత సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్తలతో నేపథ్యంలో….రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం భారత్ కు ఇప్పుడు ఎంతో అవసరమని, రష్యా నుంచి భారత్.., ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కోనుగోలు చేసేందుకు అంగీకరించాలని.., దానికోసం కాట్సా చట్టం ఆంక్షల పరిధి నుంచి భారత్ ను తప్పించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు లేఖ రాశారు.
    ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వం నడిపిన మంత్రాంగాన్ని చూసి, వివిధ దేశాలకు చెందిన రక్షణ రంగ నిపుణులు సైతం ప్రశసంలు కురిపిస్తున్నారు.!
    నిజానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా… రక్షణపరంగా ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి రష్యానే భారత్ కు కీలక భాగస్వామిగా ఉండేది.
    మోదీ మాత్రం…అటు రష్యాను , ఇటు అమెరికాను…భారత్ కు వ్యూహాత్మక కీలక భాగస్వామిగా మార్చివేశారు. మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన కూటనీతి మూలంగా 2016లోనే అమెరికా…, భారత్ ను అధికారికంగా తమ రక్షణ భాగస్వామిగా గుర్తించిందనే విషయం మనం మర్చిపోరాదు.!
    చైనా… ఒక్క భారత్‌పైనే కాకుండా, దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేసియా, ఇండొనేసియాలపై కూడా కయ్యానికి కాలుదువ్వుతోంది.! చైనాకు చెక్ పట్టే సామర్థ్యం ఒక్క భారత్ కు మాత్రమే ఉందని గుర్తించిన అమెరికా.., ఎస్-400 కొనగోళ్లపై మౌనం వస్తోందని అర్థం చేసుకోవాలి. అయితే ఏక కాలంలో రెండు అగ్రదేశాలతో సమానస్థాయిలో డీల్ చేయడం మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం. దీనిపై మీరేమంటారు.!
    మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి.! మనసా వాచా కర్మణా దేశ హితం కోసం పాటుపడదాం.! జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహిద్దాం. భారత్ మాతాకీ జై.

    దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం!
    దేశ రక్షా సమంయాగో, దృష్టో నైవచ నైవచ॥
    దేశ రక్షణకు సమానమైన పుణ్యము కానీ, వ్రతము కానీ, యాగము కానీ మరెక్కడనూ కానరాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

    Related Stories