National
సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నారు. అనేక రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియకు తెరదీయడంతో.. మోదీ రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది ఆయన వివరించే అవకాశాలున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.