More

    మోదీ నోట.. సిరిసిల్ల నేతన్న మాట

    ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడారు. తన ప్రసంగంలో మోదీ సిరిసిల్ల నేతన్న గురించి ప్రస్తావించారు. సిరిసిల్ల చేనేత వస్త్రం, చేనేత కార్మికుల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జీ-20 పేరుతో చేనేత కార్మికుడు హరిప్రసాద్ తన చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనం, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని వారిని అభినందించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానన్న మోదీ.. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందని కొనియాడారు. వచ్చే ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో వెల్లడించారని గుర్తు చేశారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త సొబగులు అద్దారని ప్రశంసించారు.

    Trending Stories

    Related Stories