ప్రధాని నరేంద్ర స్వయంగా చెత్తను తొలగించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్మించిన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీవో టన్నెల్ ను పరిశీలించారు. ఈ ప్రాంతంలో చిన్నపాటి వ్యర్థాలు ఉండటాన్ని గమనించిన మోదీ స్వయంగా వాటిని తీసి వేశారు. ఒక్కరే పరిసర ప్రాంతాలను తిలకిస్తూనే అక్కడక్కడ పడిఉన్న చిన్నపాటి వ్యర్థాలను తీసివేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అందుకే ప్రధాని సింప్లిసిటీకి ప్రపంచ వ్యాప్తంగా ఇంత మంది అభిమానులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీలో రూ.920 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు.