More

    ఖర్గే కారుకూతలకు మోదీ మర్యాదపూర్వక సమాధానం..!

    తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన “రావణ్” వ్యాఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదని అన్నారు. తనను అవమానించేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ ఉందని చెప్పారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న మోదీ గురువారం కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

    కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, మోదీ కుక్క చావు చస్తారని అన్నారని గుర్తు చేశారు. నియంత హిట్లర్ మాదిరిగా మోదీ చచ్చిపోతారని మరొక కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. నేనే మోదీని చంపేస్తానని మరొక నేత అన్నారన్నారు. రావణుడని ఓ నేత, రాక్షసుడని మరొక నేత, బొద్దింక అని మరో నేత తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను కాంగ్రెస్ నేతలు దూషించడం తనకేమీ ఆశ్చర్యంగా లేదన్నారు. కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తాను ఖర్గేను గౌరవిస్తానని.. ఆయన అడిగినదానికి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, మోదీ మన దేశానికి ప్రధాన మంత్రి అని, ఆయన తన పదవికి సంబంధించిన కార్యకలాపాలను మర్చిపోయారని, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు… ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఆయనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు చూసినా ఆయన తన గురించే మాట్లాడతారన్నారు. ‘‘మీరు మరొకరిని చూడనక్కర్లేదు, కేవలం మోదీని చూడండి, ఓటు వేయండి’’ అని చెబుతారన్నారు. మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూడాలని ప్రశ్నించారు. మీకు ఎన్ని రూపాలు ఉంటాయని ప్రశ్నించారు. మీకు రావణాసురుడి మాదిరిగా 100 తలలు ఉన్నాయా? అని నిలదీశారు.

    కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ ఇటీవల మాట్లాడుతూ, ఓ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై మాట్లాడుతూ, మోదీకి తన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు.

    Trending Stories

    Related Stories