తెలంగాణలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ

0
706

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్తావన లేకుండానే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ రాజకీయాలపై ఘాట్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా.. విశాఖ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రధాని మోదీ.. అక్కడ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. భయంతో నన్ను తిట్టే వాళ్లు ఇక్కడ ఉన్నారని, వాటి గురించి కార్యకర్తలు ఎవరూ చింతించవద్దన్నారు. 25ఏళ్లుగా వెరైటీ తిట్లు తనకు అలవాటేనని.. కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దన్నారు. పేద ప్రజలను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ బీజేపీ శ్రేణుల పోరాటం నాలో స్ఫూర్తిని నింపుతుందని, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ కమలం వికసిస్తుందన్నారు ప్రధాని మోదీ. మునుగోడు ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని, తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడుకు వచ్చిందన్నారు. బీజేపీ పోరాటం వల్లే అది సాధ్యమైంది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉప ఎన్నిక బీజేపీ బలోపేతాన్ని నిరూపిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 1984లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయని, అప్పుడు హన్మకొండ నుంచి జంగారెడ్డి గెలిచారని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. అవినీతి, కుటుంబ పాలన దేశానికి ప్రధమ శత్రువులని ప్రధాని పేర్కొన్నారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. కార్యకర్తలు కేత్రస్థాయిలో మరింత కష్టపడి పనిచేయాలని దాని ఫలితాలు త్వరలోనే చూస్తారన్నారు. తెలంగాణలో చీకటిని తరిమి సూర్యోదయం వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one + four =