National

కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. పదవులకు రాజీనామాలు చేసిన నేతలు

ప్రధాని నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా చేస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి మంత్రివర్గంలో అన్ని వర్గాల వారికి ఎన్డీఏ సర్కారు సమ ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలకు కూడా మునుపటి కంటే ఎక్కువగా మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 43 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మంత్రి వ‌ర్గంలో కొత్త‌గా కొంద‌రికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

శోభ‌, క‌పిల్ పాటిల్, శ‌ర్బానంద సోనోవాల్, మీనాక్షి లేఖి, పురుషోత్తం రూపాలా, నిసిత్ ప్ర‌మాణిక్‌, ఆర్సీపీ సింగ్‌, ప‌శుప‌తి ప‌రాస్, అనుప్రియ ‌పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాద‌వ్, త‌దిత‌రుల‌తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా 7 లోక్‌క‌ల్యాణ్ మార్గ్ చేరుకున్నారు.

ప్ర‌స్తుతం క్యాబినెట్‌లో ఉన్న కొంద‌రు మంత్రులు రాజీనామా చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్‌, సంతోష్ గాంగ్వ‌ర్‌, స‌హాయ మంత్రులు రావ్ సాహెబ్ ధాన్వే పాటిల్‌, విద్యాశాఖ స‌హాయ‌మంత్రి సంజ‌య్ దోత్రేలు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్‌ గంగ్వార్‌ కార్మిక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ఉన్న థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను కేంద్రం కర్ణాటక గవర్నర్‌గా నియమించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + four =

Back to top button