More

    భారత్-అమెరికా ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలు: బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన కీలక సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. అనంతరం బైడెన్ తో కలిసి సంయుక్తంగా ప్రసంగించారు. బైడెన్ తో ఈ సమావేశం ఎంతో కీలకమైనదని మోదీ అన్నారు. బైడెన్ నాయకత్వానిదే ఈ దశాబ్దంలో కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. బైడెన్ హయాంలో భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత పటిష్టమవ్వాలని, ఇరుదేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. భారత్, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బైడెన్ మాట్లాడుతూ భారత్-అమెరికా బంధం ఎంతో కీలమైనదని తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని అన్నారు. ప్రపంచంలోనే భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని.. ప్రపంచ సవాళ్లకు భారత్-అమెరికా బంధం పరిష్కారం చూపాలని అన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీసులో మోదీకి బైడెన్‌ స్వాగతం పలికారు.

    ఈ దశాబ్దం ఎలా ఉంటుందనే విషయంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషించనుంది. భారత్, అమెరికా మధ్య మరింత బలమైన బంధానికి విత్తనాలు నాటామని బైడెన్‌తో మోదీ అన్నారు. వచ్చేవారం జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాలను బైడెన్‌ ప్రస్తావించారు. ఆయన చూపిన అహింస, ఓర్పులాంటి సూత్రాల అవసరం ఇప్పుడు ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించే ట్రస్టీషిప్‌ సిద్ధాంతాన్ని మోదీ గుర్తు చేశారు. ఇరు రాజ్యాల మధ్య రాబోయే రోజుల్లో బంధాన్ని ధృడోపేతం చేసే శక్తి వాణిజ్యానికి ఉందన్నారు. 40 లక్షల మంది ఇండో– అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తివంతం చేస్తున్నారన్నారు. భారతీయ సంతతి అమెరికా పురోగతిలో భాగం కావడంపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ప్రధానితో పాటు జైశంకర్, అజిత్‌దోవల్, హర్షవర్ధన్‌ శ్రింగ్లా, తరణ్‌జిత్‌ సింగ్‌ సంధూ, అమెరికా తరఫున ఆంటోనీ బ్లింకెన్, జేక్‌ సల్లివాన్, జాన్‌ కెర్రీ, కర్ట్‌ చాంబెల్, డోనాల్డ్‌ లూ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. భేటీ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్‌ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో ప్రధాని సంతకం చేశారు.

    Trending Stories

    Related Stories