More

  హెయిర్ కట్ సరిగా చేయలేదు.. ఐటీసీ మౌర్యకు రెండు కోట్ల రూపాయల జరిమానా

  ఢిల్లీకి చెందిన వినియోగదారుల కోర్టు ఐటీసీ మౌర్య ఫైవ్ స్టార్ హోటల్ కు రెండు కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో హెయిర్‌స్టైలిస్ట్ మోడల్ కు సరిగా హెయిర్ కట్ చేయలేదు.. దీంతో ఆమె ఉపాధి అవకాశాలను కోల్పోవడమే కాకుండా ఆమె మానసికంగా ఎంతో క్షోభను అనుభవించింది. దీంతో ఆ మోడల్‌కి రూ .2 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ఢిల్లీలోని వినియోగదారుల కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. సదరు మహిళకు కలిగిన మానసిక క్షోభ విషయంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తన ఆర్డర్‌లో సెప్టెంబర్ 21, మంగళవారం తేదీన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళకు రూ .2 కోట్ల పరిహారం చెల్లించాలని కోరింది.

  జస్టిస్ ఆర్‌కె అగర్వాల్, ఎస్ ఎం కాంతికర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మాట్లాడుతూ “మహిళలు తమ జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనడంలో సందేహం లేదు. వారు జుట్టును మంచి స్థితిలో ఉంచడానికి డబ్బును ఖర్చు చేస్తారు. వారు తమ కేశాలంకరణ విషయంలో మానసికంగా కనెక్ట్ అయి ఉంటారు ” అని తెలిపారు. కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సేవలో లోపం ఉన్నట్లయితే 8 వారాలలోపు ఫిర్యాదుదారు ఆష్నా రాయ్‌కు పరిహారం చెల్లించాలని కోర్టు ఐటీసీని కోరింది. ఆమె స్కాల్ప్ కాలిపోయింది.. అప్పటి ఘటన కారణంగా మహిళకు ఇంకా అలెర్జీ మరియు దురద ఉందని కమిషన్ తెలిపింది.

  మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా ఇటీవలే తీర్పు వచ్చింది. 2018 ఏప్రిల్‌ 18న మోడల్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల ఆష్నా రాయ్‌ చెన్నైలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసింది. హెయిర్‌ కటింగ్‌ చేసుకునేందుకు ఆ రోజు హోటల్‌లో ఉన్న సెలూన్‌కి వెళ్లింది. తనకు ఇంటర్వ్యూ ఉందని, జుట్టును కింది నుంచి నాలుగు అంగులాల వరకు కత్తరించమని సూచించింది. హెయిర్‌ డ్రస్సర్‌ కటింగ్‌ చేస్తుండగా ఆమె కళ్ల జోడు తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత డ్రెస్సర్‌ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించుకుంది. తీరా కటింగ్‌ పూర్తయిన తర్వాత చూస్తే జుట్టును కింది నుంచి కాకుండా మొదలు నుంచి నాలుగు అంగుళాల వరకు ఉండేలా కటింగ్‌ చేశారు. తనకు జరిగిన నష్టంపై ఆష్నా రాయ్‌ హోటల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా సరైన స్పందన ఇవ్వలేదు. ఆష్నా రాయ్‌ నేషనల్‌ కన్సుమర్‌ డిస్ప్యూట్‌ రీడ్రెస్సల్‌ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)ని సంప్రదించింది. హోటల్‌ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, పైగా వారు ఉపయోగించిన కెమెకల్స్‌ వల్ల తన స్కాల్ప్‌ పాడైందంటూ కోర్టుకు తెలిపింది. తనకు పొడవైన జుట్టు ఉండటం వల్ల పలు ప్రముఖ కంపెనీల షాంపూ యాడ్లలో నటించాని, ప్రస్తుతం తనకు ఆ అవకాశం పోయిందంటూ కోర్టుకు వివరించింది. “ఆమె తనను తాను అద్దంలో చూడటం మానేసింది. ఆమె సామాజిక కార్యకలాపాలు మారిపోయాయి. కానీ ఆమె చిన్న జుట్టు కారణంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. చిన్నగా జుట్టు కత్తిరించిన తర్వాత మానసిక క్షోభ అనుభవించింది. ఆమె ఆదాయాన్ని కోల్పోయింది. ఆమె తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. ఆమె పొడవాటి జుట్టు కారణంగా పలు ఉత్పత్తులకు మోడల్‌గా ఉన్నారని.. పెద్ద బ్రాండ్‌లకు మోడలింగ్ చేశారు. కానీ ఆమె సూచనలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించడం వల్ల ఆమె పనులను కోల్పోయింది. ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది. టాప్ మోడల్ కావాలనే ఆమె కలను పాడు చేసింది” అని బెంచ్ పేర్కొంది.

  ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఐటీసీ మౌర్య హోటల్‌లో ఉన్న హెయిర్‌ డ్రెస్సర్‌, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించింది. జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 2 కోట్లను బాధిత మహిళకు చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది.

  Trending Stories

  Related Stories