వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..?

0
748

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిన్న రాత్రి అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నారని తెలుస్తోంది. మరికాసేపట్లో అరెస్ట్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అనంతబాబుతో పాటు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్టు విచారణలో అనంతబాబు అనుచరులు అంగీకరించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు చాలా ప్రయత్నాలే చేసినట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యంను చాలా దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. తలపై బలంగా మోదారు. చేతులు విరిచేశారు. ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టారు. గొంతు నొక్కడంతో ఊపిరి ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు ఈనెల 20న రాత్రి 7.30కి అనంతబాబు అనుచరుడు మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు అతడు చనిపోయాడని చెప్పారు. యాక్సిడెంట్ అవ్వడం వలనే తన డ్రైవర్ చనిపోయాడని అనంతబాబు చెప్పినా ఎవరూ నమ్మే స్థితిలో కనిపించలేదు.