Telugu States

ఎమ్మెల్సీ అనంత‌బాబుకు బెయిల్

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత‌బాబుకు సోమ‌వారం బెయిల్ ద‌క్కింది. అనంత‌బాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అనంత‌బాబు త‌ల్లి అనారోగ్య కార‌ణాల‌తో ఆదివారం మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేలా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల్లోగా తిరిగి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలుకు వ‌చ్చి లొంగిపోవాల‌ని కోర్టు ఆయ‌న‌ను ఆదేశించింది. 3 రోజుల పాటు స్వ‌గ్రామం ఎల్ల‌వ‌రం దాటి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని కూడా తెలిపింది. త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు మాత్ర‌మే ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని.. అనంతబాబుతో పోలీసులు ఉండాల‌ని ఆదేశించింది. కేసు గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించకూడ‌ద‌ని ష‌ర‌తు విధించింది.

అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరత్‌లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 25 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేయబడింది. అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.

Related Articles

Back to top button