More

    సుబ్రహ్మణ్యం ది హత్యేనని తేల్చిన ఫోరెన్సిక్ టీమ్.. భార్య అపర్ణకు టీడీపీ అధినేత ఫోన్

    వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. అతడిని తీవ్రంగా కొట్టడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, దీంతో అతడు చనిపోయాడని నివేదిక తేల్చింది. హత్య అని తేలడం, భారీగా నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అనంత ఉదయ్ భాస్కర్ ను ఏ1 నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. కాకినాడ ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉన్నట్టు ఆచూకీ తెలిసింది. దీంతో ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. సాయంత్రంలోగా అనంత్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

    హత్యకు గురైన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబే కారణం అని ఈ సందర్భంగా అపర్ణ టీడీపీ అధినేత కు వివరించింది. తెలుగుదేశంతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లనే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పింది. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని, ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని, కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించింది. దైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ తరపున అండగా ఉంటామని చంద్రబాబు అపర్ణకు తెలిపారు. నిందితుడు అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చెయ్యకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. కళ్లముందు పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళుతుంటే ఇప్పటికీ అరెస్టు చెయ్యకపోవడం బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉందని చంద్రబాబు అన్నారు.

    Trending Stories

    Related Stories