More

    పవన్ నీ కేడర్ ను అదుపులో పెట్టుకో: వల్లభనేని వంశీ

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ క్యాడర్ ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలను తిడుతూ వీడియోలు చేస్తున్నారని తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఘటనలపై వారు నోరు కూడా మెదపడంలేదని.. అక్కడ ఆస్తులు ఉన్నాయి కనుక విమర్శించలేరా అని నిలదీశారు.

    విశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ఊరకనే ఆరోపణలు చేయటం ఎందుకు అని.. సీబీఐతోనో, ఎఫ్‌బీఐతోనో విచారణ చేయమని కేంద్రాన్ని అడగాలని ప్రతిపక్షాలకు వల్లభనేని వంశీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిని తానేనని.. ఈ విషయంలో టీడీపీ వాళ్ళకు కూడా స్పష్టత ఉందన్నారు. వైసీపీలో ఎవరికైనా అనుమానాలు ఉంటే అధిష్టానం దగ్గరకు వెళ్ళి స్పష్టత తెచ్చుకోవచ్చన్నారు. వెన్నుపోటు ఇంకా చంద్రబాబును వెంటాడుతూనే ఉందని.. ప్రజలు నమ్మటం లేదని అర్ధమైందన్నారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories