ఎమ్యెల్యేను కండువా పట్టుకుని నిలదీసిన గ్రామస్థులు

0
797

అల్లూరి జిల్లా అరకు వేలి మండలం మాడగడ పంచాయితీ మాడగడ గ్రామంలో స్థానిక ఎమ్యెల్యే కు చేదు అనుభవం ఎదురయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లిన ఎమ్యెల్యే శెట్టి ఫాల్గుణ తమ ఐదున్నర ఎకరాల భూమిని కబ్జా చేసారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు ఎమ్యెల్యేను కండువా పట్టుకుని నిలదీశారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుని ఎమ్యెల్యేను వారి నుండి తప్పించారు. గిరిజనుల నుండి ఈ రకంగా తిరుగుబాటు ఎదురుకావడంతో, ఇక చేసేది లేక వెను తిరిగారు ఎమ్యెల్యే ఫాల్గుణ. గతంలో కూడా గ్రామస్థులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించి ఎమ్యెల్యే కబ్జా చేసిన భూమిని తమకు అప్పగించాలంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. గిరిజనుల గోడును అధికారులు పట్టుంచుకోలేదు. ఇప్పుడు ఇలా ఎదురుతిరిగారు గ్రామస్థులు.