More

    ఎమ్మెల్యే రాజాసింగ్‎ను విడుదల చేయాలని పూజలు

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జిల్లా కేంద్రంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకముందు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. మానవహారం నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‎ను అరెస్ట్ చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ అన్నారు. వెంటనే ఎమ్మెల్యేను విడుదల చేయాలని కోరారు.

    Trending Stories

    Related Stories