More

    ఆ షో పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజా సింగ్

    బిగ్ బాస్ షో.. అసలు మన కల్చర్ కానే కాదు. ఇప్పటికే ఈ షో మీద తీవ్ర విమర్శలు, ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ షోల టెలీకాస్ట్ ఆపివేయాలని చాలానే డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ షోపై మండిపడ్డారు. ఆదివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ విషయంలో ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రవి ఎలిమినేషన్ పై తమకు అనుమానాలు కలుగుతున్నాయని, దీని వెనుక ఏదైనా కుట్ర జరిగివుంటుందని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బయటికి పంపించి వేయడం ద్వారా వివాదం సృష్టించాలనుకుంటున్నారా? అని రాజా సింగ్ బిగ్ బాస్ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనిపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని, తెలుగు బిగ్ బాస్ షోతో పాటు, హిందీ బిగ్ బాస్ షోను సైతం నిషేధించాలని కోరతానని తెలిపారు.

    అసలు ఆ షోలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. యాంకర్ రవిని బయటకు పంపడంలో ఏం జరిగిందనేది తెలియాలన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ షోను తెలంగాణలో బ్యాన్ చేయాలని.. రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్లు శృతి మించుతున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద రవి అభిమానులు గొడవ చేశారని, ఈ గొడవలకు కారణం బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రమేనని అన్నారు. హిందూ దేవుళ్లను బిగ్ బాస్ షోలో అవమానపరుస్తున్నారని రాజా సింగ్ అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో.. అది బయటకు రావాలని కామెంట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు అవసరమా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories