More

    మరోసారి మోరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. నడి రోడ్డు మీద ఎమ్మెల్యే..!

    ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ మళ్లీ రోడ్డుపై మొరాయించింది. సోమవారం నాడు రాజాసింగ్ శంషాబాద్ నుంచి తన ఇంటికి వాహనంలో వెళ్తుండగా పురానాపూల్ సర్కిల్ వద్ద ఆగిపోయింది. ప్రభుత్వం తనకు కేటాయించిన వెహికల్ ఇప్పటికి ఐదుసార్లు రోడ్డు మీద ఆగిపోయిందని వాపోయారు. అవసరం లేని వారికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను ఈ ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోపించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను ప్రభుత్వం ఇచ్చిందని, తనకు మాత్రం మొరాయించిన వాహనం కేటాయించారన్నారు. ఇలాంటి వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. తన వాహనం ఆగిపోవడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ సమస్య కలగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు మంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను ఇచ్చిన సర్కార్ తనకు పాడైన వెహికల్ ఇవ్వడం వెనుక కుట్ర ఉందని అన్నారు. ఈ వెహికల్ ను వాపస్ తీసుకోవాలని పోలీసులను కోరినా స్పందించడం లేదని చెప్పారు.

    తన భద్రతకు ముప్పు ఉందని మూడు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంటెలిజెన్స్ ఐజీకి లెటర్‌ రాసిన రాజాసింగ్.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తన బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం మార్చాలని కోరారు. తరచూ తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం బ్రేక్‌డౌన్ అవుతుందని.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories