More

    మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరగబోతోంది: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

    మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరగబోతోందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. శివసేన రెబెల్ ఎంపీ ఏక్ నాథ్ షిండే… ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ అండతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగా.. అచ్చం అలాంటిదే తెలంగాణలో కూడా జరగబోతోందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెపుతున్నానని రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని, తమ పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ చెప్పారు. ఏ క్షణంలోనైనా వారు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories