వికేంద్రీకరణకు మద్దతుగా కరణం ధర్మశ్రీ రాజీనామా

0
763

వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‎లో స్పీకర్ ఫార్మాట్‎లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‎కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అమరావతికి మద్దతుగా టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. మరోవైపు ఈ నెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 + twelve =