More

    వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి

    రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఉన్న 101 నంబరు ఫ్లాటుకు ఆయన వచ్చి వెళ్తుంటారు. మూడురోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంజునాథరెడ్డిది అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీ నేత. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని.

    ఇక విషయం తెలిసిన వెంటనే మహేశ్వర్‌రెడ్డి విజయవాడ చేరుకున్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు. 101 నంబరు ఫ్లాటు బాధ్యతలను చూసే నరేంద్రరెడ్డి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఫ్లాట్‌లోకి వెళ్లారని, ఆ తర్వాత కాసేపటికే అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మంజునాథరెడ్డి పడిపోయాడని నరేంద్రరెడ్డి పిలవడంతో అంబులెన్స్‌ వచ్చింది. మంచం పక్కనే ఆయన కిందపడుకుని ఉన్నట్టు కనిపించారని.. అప్పటికే చనిపోయారా అనే విషయం తమకు తెలియదని అన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    spot_img

    Trending Stories

    Related Stories