కారు దిగి మరీ మాస్క్ లు పెట్టిన ముఖ్యమంత్రి

0
735

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు చెన్నై వీధుల్లో మాస్క్‌లు పంపిణీ చేస్తూ కనిపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనావైరస్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో, తన కారును ఆపి ప్రజలకు మాస్క్‌లు పంచుతున్నట్లు కనిపించారు. వీధుల్లో మాస్క్‌లు లేకుండా కొంతమందిని చూశానని చెప్పారు. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ .. మాస్క్ లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్న‌వారికి మాస్క్‌లు అందించారు. ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, పంజాబ్ త‌ర‌హాలోనే త‌మిళ‌నాడులోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ సెక్ర‌టేరియేట్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తున్న స‌మ‌యంలో.. రోడ్డుపై వెళ్తున్న కొంద‌రు మాస్క్‌లు లేకుండా తిరుగుతుండ‌డాన్ని గ‌మ‌నించారు. ఆ స‌మ‌యంలో త‌న కారును ఆపి.. సీఎం స్టాలిన్ మాస్క్‌లు లేని వారికి వాటిని అందించారు. కొంద‌రికి ఆయ‌నే స్వ‌యంగా తొడిగారు. దీనికి సంబంధించిన వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

“నేను ప్రధాన కార్యాలయం నుండి క్యాంపు కార్యాలయానికి తిరిగి వస్తుండగా, కొంతమంది బహిరంగంగా మాస్క్ లు ధరించకపోవడాన్ని నేను గమనించాను.” అని తమిళంలో ఆయన ట్వీట్ చేశారు. “దయచేసి అందరూ మాస్క్ ధరించండి!” అని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. వీడియో క్లిప్‌లో ఆయన ఒక వ్యక్తికి మాస్క్ ధరించడంలో సహాయం చేస్తున్నారు.

కరోనా మహమ్మారి దేశాన్ని తాకినప్పటి నుండి, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలని లేదంటే జరిమానాను ఎదుర్కోవాలని అధికారులు పదేపదే ప్రజలను కోరుతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓమిక్రాన్ వేరియంట్ దేశంలోని చాలా ప్రాంతాలలో ఎంతో వేగంగా వ్యాప్తి చెందడంతో కోవిడ్ నియమాలను అనుసరించాల్సిన అవసరం ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పలు నగరాల్లో పెరుగుతూ ఉన్నాయి.