More

    డీఎంకే అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి కూడా..!

    ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్ పేరును పార్టీ నేతలు ఏకపక్షంగా ఆమోదించారు. సీనియర్‌ నాయకులు ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్‌, కోశాధికారిగా టీఆర్‌ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ రెండోసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. డీఎంకే పార్టీ ముఖ్య కార్యదర్శిగా కేఎన్ నెహ్రూను నియమితులయ్యారు. గతంలో డీఎంకే మహిళా విభాగానికి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధిని ప్రస్తుతం డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. పెరియసామి, కే పొన్ముడి, ఏ రాజా, అంతియూర్ సెల్వరాజ్‌లతో పాటు కనిమొళిని కూడా డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి మరణంతో 2018 లో స్టాలిన్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎంకే స్టాలిన్‌ గతంలో పార్టీ కోశాధికారిగా, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా సేవలందించారు. 1949 లో డీఎంకేను స్థాపించగా.. 1969 లో కరుణానిధి పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పటివరకు పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

    Trending Stories

    Related Stories