మిస్ ఇండియాగా సిని శెట్టి

0
914

ఫెమినా మిస్ ఇండియా-2022 టైటిల్ ను సిని శెట్టి గెలుచుకుంది. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సిని శెట్టిని నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. 21 ఏళ్ల సిని శెట్టి స్వరాష్ట్రం కర్ణాటక అయినప్పటికీ… ఆమె పుట్టి, పెరిగింది ముంబైలోనే. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తోంది. ఈ పోటీలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా ఎంపికయింది. మిస్ ఇండియా జ్యూరీ ప్యానల్ లో సినీ నటులు డినో మోరియా, నేహా ధూపియా, మలైకా అరోరా, ప్రముఖ డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులు ఉన్నారు.

ఈ పోటీల్లో మిస్ తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఐదవ స్థానంలో గార్గీ నంది నిలిచారు. ఫెమీనా మిస్ ఇండియా కిరీటం 2020లో ఫెమీనా మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి చేతుల మీదుగా సిని శెట్టి అందుకుంది. 58వ ఫెమీనా మిస్ ఇండియా అందాల పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టు పాల్గొన్నారు.