ఆలయం ముందు మందు తాగుతూ, మాంసం తిన్నారు.. భారత మాత చిత్రాన్ని చింపేశారు

0
1015

ఆలయం ముందు మందు తాగుతూ మాంసం తినడం కరెక్ట్ కాదని ఓ వర్గానికి చెందిన వ్యక్తులను అడ్డుకున్నందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలపై దాడులకు దిగారు కొందరు. 50-70 మంది కలిసి ఆర్ఎస్ఎస్ ఆఫీసు లోకి చొరబడి బూతులు తిట్టి, దాడులు చేయడమే కాకుండా భరతమాత చిత్ర పటాన్ని కూడా చింపేశారు. రాళ్లతో దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. మద్యం సేవించి గొడవకు దిగిన ఒక వర్గానికి చెందిన వారు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో 6 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత.. సంఘ్ తో పాటూ సంబంధిత సంస్థలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. ఆగ్రాలోని లోహమండి పోలీస్ స్టేషన్‌లోని అలమ్‌గంజ్ ఔట్‌పోస్టు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సంఘ్ కార్యాలయం ఎదురుగా రాధా కృష్ణ దేవాలయం ఉంది. ఈ ఆలయం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులు గుమిగూడి మద్యం సేవించి అల్లరి చేస్తూ ఉండేవారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయం ముందు మద్యం, మాంసం సేవిస్తుండటాన్ని చూసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత 50-70 మందితో తిరిగి వచ్చి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. కార్యాలయంలో ఉంచిన భారతమాత చిత్రాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అక్కడే ఉన్న వికాస్ గుప్తా, శివమ్ కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో, బీజేపీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు.

ఆగ్రా సౌత్‌కు చెందిన ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కొందరి దుండగులు వేరే ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టారని ఆరోపించారు. కార్యకర్తలను చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎస్పీ సుధీర్‌కుమార్‌ సింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. సంఘ్ కార్యకర్తలపై దాడికి సంబంధించి 40-50 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు SSP తెలిపారు. నిందితులపై గ్యాంగ్‌స్టర్ చట్టం, జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.