More

    హర్ష అంతిమయాత్రపై కూడా రాళ్లను విసిరారు

    కర్ణాటక రాష్ట్రం శివ మొగ్గ జిల్లా కేంద్రంలో ఆదివారం (ఫిబ్రవరి 20) రాత్రి కామత్ పెట్రోల్ బంక్ సమీపంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి చంపారు. హర్ష ను మెక్ గన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు ప్రాణాలను వదిలాడు. మరణించిన 26 ఏళ్ల హిందూ కార్యకర్త హర్ష అంత్యక్రియల ఊరేగింపు శివమొగ్గలోని జిల్లా మెక్‌గన్ ఆసుపత్రి నుండి వద్యనగర్‌లోని రోటరీ శ్మశానవాటికకు సాగింది. పెద్ద ఎత్తున ప్రజలు అంతిమయాత్రకు చేరుకున్నారు. ఈ సమయంలో అంతిమ యాత్ర ఊరేగింపుపై దుండగులు దాడి చేశారు.

    అంత్యక్రియల ఊరేగింపుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడిలో ఒక పోలీసు, ఒక ఫోటో జర్నలిస్ట్, ఒక మహిళతో సహా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని మరిన్ని నివేదికలు తెలిపాయి. దాడికి సంబంధించిన దృశ్యాలను న్యూస్9 రిపోర్టర్ ప్రియాంక రుద్రప్ప సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ రాళ్ల దాడి చోటు చేసుకుంది. 20 వాహనాలు ధ్వంసమయ్యాయని, కొన్నింటికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర సజావుగా సాగింది. వార్తా సంస్థ ANI షేర్ చేసిన చిత్రాల ప్రకారం, పోస్ట్‌మార్టం తర్వాత పోలీసు భద్రత మధ్య హర్ష భౌతికకాయాన్ని అతడి నివాసానికి తీసుకెళ్తుండగా వందలాది మంది ఊరేగింపులో పాల్గొన్నారు.

    ఈ హత్యకు సంబంధించి నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 21) అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి లభించిన సమాచారం ప్రకారం మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షపై మరో నలుగురితో కలిసి కారులో వచ్చి దాడి చేసినట్లు దొడ్డపేట పోలీస్‌స్టేషన్‌లో ఖాసీఫ్‌ను విచారించగా అంగీకరించాడు. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేసిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

    Trending Stories

    Related Stories