బీజేపీ కార్యాలయంపై బాంబులతో దాడి

0
1064

ఫిబ్రవరి 10వ తేదీ గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో తమిళనాడు రాజధాని చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు. పోలీసులను చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ సభ్యుడు కరాటే త్యాగరాజన్ ఓ ప్రకటన విడుదల చేశారు. “మా కార్యాలయంపై తెల్లవారుజామున 1:30 గంటలకు పెట్రోల్ బాంబు విసిరారు. 15 సంవత్సరాల క్రితం డీఎంకే సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వం పాత్ర ను మేము ఖండిస్తున్నాము… మేం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం.. ఇలాంటి వాటికి బీజేపీ క్యాడర్ భయపడవద్దు.” అని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదని తెలిపారు, అలాగే ఆస్తి నష్టం కూడా అవ్వలేదని నివేదించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఉదయం బీజేపీ నేతలు పార్టీ కార్యాలయం ఎదుట గుమిగూడి ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.