More

    ఒలింపిక్స్ లో ఖాతా తెరచిన భారత్.. మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్..!

    ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరచింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెలుచుకుంది. ఎన్నో అంచనాలతో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అడుగుపెట్టిన మీరాబాయి చాను అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. 49 కేజీల విభాగంలో రజతం సొంతం చేసుకుంది.

    మీరాబాయ్ తన మొదటి ప్రయత్నంలో 110 కిలోల క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో అద్భుతంగా రాణించింది. ఆమె మొత్తం (110 + 87 కిలోలు) 197 కిలోలు (ఆమె స్నాచ్ ఫలితంతో సహా).

    మీరాబాయి తన రెండవ ప్రయత్నంలో 115 కిలోలు ఎత్తింది. తన ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. ఆమె మొత్తం 203 కిలోలు (115 + 87 కిలోలు) ఎత్తడంతో పతకం సొంతమైంది.

    మూడో ప్రయత్నంగా ఆమె 117 కిలోలు ఎత్తడానికి ప్రయత్నించగా అది విఫలం అయింది. ఒలింపిక్ స్వర్ణం చైనాకు చెందిన జిహుయి అందుకోనుంది. మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ లభించింది. మూడో స్థానంలో ఇండోనేషియా నిలిచింది.

    Trending Stories

    Related Stories