అవసరంలో ఆదుకున్నవాడిని దేవుడంటారు. అయితే అవసరాన్ని ఆసరాగా చేసుకుని దారుణాలు చేసేవాడిని ఏమనాలి..? మధ్య ప్రదేశ్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. పేద పిల్లల ఆకలిని ఆసరాగా చేసుకుని బలవంతంగా మతం మార్చిన ఓ ప్రబుద్ధుడి దాష్టీకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫ్రెండ్స్.. ఆ వివరాలు మీకు సవివరంగా అందజేస్తాను. కానీ, అంతకుముందు నేషనలిస్ట్ హబ్‌తో పాటు.. మన గ్రూపాఫ్ ఛానెల్స్‌ను కూడా సబ్స్క్రయిబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఈ వీడియోను పదిమందికీ షేర్ చేయండి. మీ చేయూతే జాతీయవాద జర్నలిజానికి కొండంత బలమని మర్చిపోవద్దు.
బలవంతపు మతమార్పిడి నిరోధానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా.. అది విష వృక్షంలా విస్తరిస్తూనేవుంది. చివరికి నిరుపేద పిల్లల్ని కూడా దుర్మార్గులు వదలడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. చైనావాడు వదిలిన కరోనా మహమ్మారి ఎన్నో దేశాలను అష్టకష్టాలకు గురిచేసిన విషయం మనకు తెలిసిందే కదా..! కొవిడ్ వల్ల ఆర్థికంగా అతలాకుతలమయ్యేలా చేసింది. ఇందుకు మన దేశం కూడా అతీతం కాదు. అనివార్య పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం వల్ల ఎందరో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఎంతో మందికి ఆహారం అందక నానాయాతనకు గురయ్యారు. ఆ విపత్కర సమయాన్నే ఓ చైల్డ్ కేర్ నిర్వహకుడు తనకు అనులకూంగా మల్చుకున్నాడు. కోవిడ్ లాక్ డౌన్ తీవ్రంగా ఉన్న సమయంలో అనూహ్యంగా ముగ్గురు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి వేరయ్యారు. 4, 6, 8 ఏళ్ళ వయసున్న ఇద్దరు బాలురుతో పాటు ఒక బాలిక భోపాల్ వీధుల్లో తచ్చాడుతూ కనిపించారు. అయితే వీరిని చూసిన చైల్డ్ కేర్ నిర్వాహకుడు హసీన్ పర్వేజ్.. తన చైల్డ్ కేర్ సెంటర్ కు తీసుకెళ్ళాడు.
అయితే, అన్నం పెట్టి ఆదుకుంటాడని భావించిన అమాయక పిల్లలను బలవంతంగా మతం మార్పించాడు. వారి పేర్లను మార్చి నకిలీ ఆధార్ కార్డులను కూడా సృష్టించి,.. వారికి తండ్రిగా కూడా తన పేరునే రాయించుకున్నాడు. ఈ విధంగా పిల్లలకు సహాయం పేరుతో మతమార్పిడీకి పాల్పడుతున్న ఘటనపై అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు నిర్వాహకుడిపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కమిషన్ ఈ మతమార్పిడీ ఘటనపై ఎన్సీపీసీఆర్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు నిర్వహించిన ఎన్సీపీసీఆర్ ఛైర్మన్ ‘ప్రియాంక్ కానూన్’ ఈ చైల్డ్ కేర్ సంస్థలో మతమార్పిడీలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ,.. తన తనిఖీల్లో చైల్డ్ కేర్ లో పిల్లల మతమార్పిడీ జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ముగ్గురు పిల్లలను మతమార్పిడీ చేసి వారి పేర్లను కూడా మారుస్తూ డాక్యుమెంట్లను సృష్టించినట్లు ప్రియాక్ కానూన్ తెలిపారు. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయనీ,.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.
ఇక ఈ విచారణలో ముగ్గురు పిల్లలు ఓబీసీ వర్గానికి చెందినవారుగా ఎన్సీపీసీఆర్ గుర్తించింది. వీరంతా మధ్య ప్రదేశ్ లోని దామోహ్ జిల్లాకు చెందిన వారని తెలిపింది. ముగ్గురు పిల్లలను కూడా తన తండ్రికి అప్పగించినట్లు ఎన్సీపీసీఆర్ ఛైర్మన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎన్సీపీసీఆర్ విచారణకు ఆదేశించింది. చైల్డ్‌కేర్ సెంటర్ ప్రైవేటు సంస్థ అయినా,.. ప్రభుత్వం దగ్గరనుంచి నిధులను కూడా పొందుతోందని గ్రహించింది. ఈ ఘటనపై చైల్డ్‌కేర్ నిర్వాహకుడు హసీన్ పర్వేజ్‌ను ఎన్సీపీసీఆర్ విచారిస్తోంది. ఈ ఘటనలో నిందితుడిది తప్పని తేలితే అతడిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది.
అయితే ఇటువంటి ఘటనలు కొత్తేమీ కావు. దేశ వ్యాప్తంగా సహాయం పేరుతో చిన్న పిల్లలను, అనాధలను మతమార్పిడే చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ మతమార్పిడీ ముఠాలకు విదేశాల నుంచి సహాయం పేరుతో భారీగా నిధులు కూడా అందుతున్నాయి. కొన్ని సంస్థలకైతే తమ సంస్థల్లో ఉన్న మెంబర్లను బట్టి నిధులు చేరుతున్నాయి. అయితే ఈ నిధులను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్సీఆర్ఏ నిబంధనలను సాధ్యమైనంత మేరకు కట్టడి చేసింది. ఎన్నో నకిలీ ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసింది. అయినా కూడా కొత్తవి ఇప్పటికీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మతమార్పిడీ సంస్థలకు ఇతర మార్గాల్లో నిధులు అందుతూనే ఉన్నాయి. అందుకే ఈ మతమార్పిడీ ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నిఘా వేసి ఉంచాల్సిన అవసరముంది. తరచూ పోలీసులతో తనిఖీలు చేయించి పర్యవేక్షించాల్సిన అవసరముంది. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు మరిన్ని జరగకుండా మతమార్పిడీ నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేయాల్సి ఉంటుంది.