More

  అడుక్కు తినే దేశంలో ఆగని అకృత్యాలు.. మతం మారనందుకు హిందూ మహిళపై దాష్టికం..!

  శత్రు దేశాన్ని పాకిస్థాన్ దేశం అనడం కంటే పాపాల దేశం అంటే బాగుంటుందేమో.. ఎందుకంటే అక్కడ జరిగే అకృత్యాలు, అరాచకాలు అలా ఉన్నాయి. ఆ ముస్లిం దేశంలో ఇతర మతస్థులకు అసలు కనీస రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా హిందువులను క్రూరంగా హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. హిందూ మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు దేశం కరువు కాటకాలతో అల్లాడుతోంది. ప్రపంచ దేశాల ముందు అడుక్కు తింటోంది. తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట లేక ఆ దేశ ప్రజలు నరకం అనుభవిస్తున్నా అక్కడి వారికి, ఆ దేశ ప్రభుత్వానికి మాత్రం బుద్ది రావడం లేదు.

  ఆర్థిక సంక్షోభం, దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడినా.. నేరాలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సరిహద్దులో నివాసం ఉండే హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. సింధ్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు అమానవీయానికి పాల్పడ్డారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలని ఒత్తిడి చేశారు. దీనిని ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టినా.. కనీసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

  తనను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి సహచరులు బెదిరించారని బాధితురాలు తెలిపింది. దానికి తాను ఒప్పుకోలేదని.. దీంతో వారు తన్ను కిడ్నాప్ చేశారని చెప్పారు. మూడు రోజుల పాటు అత్యాచారం చేశారని… చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబసభ్యులకు విషయం తెలిపానన్నారు. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. కనీసం వాళ్లు పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

  కాగా.. భారత్, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న సింధ్‌ ప్రావిన్స్‌లో నివాసముండే హిందువులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతులు, మహిళల్ని కిడ్నాప్‌లు చేయడం, బలవంతంగా మతమార్పిడలకు పాల్పడటం పెద్ద సమస్యగా మారింది. థార్‌, ఉమర్‌కోట్‌, మిర్‌పుర్‌ఖాస్‌, ఘోట్కి, ఖైరాపూర్‌ వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

  అలాగే పాకిస్థాన్ లో ఉగ్రవాదులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. శత్రు దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌కు చెందిన థింక్-ట్యాంక్ పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ ప్రకారం.. 2022లో 262 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. వివిధ జాతీయవాద తిరుగుబాటుదారులు, మతపరమైన ప్రేరేపిత తీవ్రవాదులు, హింసాత్మక సెక్టారియన్ గ్రూపులు పాకిస్తాన్‌లో మొత్తం 262 తీవ్రవాద దాడులను నిర్వహించాయి. ఇందులో 14 ఆత్మాహుతి బాంబు దాడులు ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27 శాతం ఉగ్రవాదులు పెరిగాయని PIPS తన వార్షిక నివేదికలో పేర్కొంది.

  అలాగే.. ఈ ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. ఇది 2021లో జరిగిన మరణాల కంటే 25 శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. ఇది కాకుండా, ఇందులో సుమారు 734 మంది గాయపడినట్లు కూడా నివేదికలో చెప్పబడింది. 2022లో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా మరణించిన వారిలో దాదాపు సగం మంది భద్రతా బలగాలు, చట్ట అమలు సంస్థల సిబ్బందేనని తెలుస్తుంది.

  Trending Stories

  Related Stories