కాకినాడలో బాలికపై కరస్పాండెంట్ అత్యాచారం

0
902

ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న 15 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన ఆమెపై వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్ను పడింది. బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. బాలికకు మాయమాటలు చెప్పి ఈ ఏప్రిల్‌లో తన గదికి తీసుకెళ్లిన నిందితుడు విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇవ్వడంతో.. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత విజయ కుమార్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఆరా తీయడంతో అత్యాచారం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు గర్భస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు. విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు విజయ కుమార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.