More

    మాజిద్ ఖాన్ అనే యువకుడు మోహిత్ గా పరిచయం చేసుకుని.. 15 సంవత్సరాల మైనర్ పై

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాని జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు 15 సంవత్సరాల అమ్మాయికి ప్రేమ పేరుతో దగ్గరై.. ఆ తర్వాత ఆమెను ఇస్లాం స్వీకరించమని కోరాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో అతడు మరో ముగ్గురితో కలిసి ఆమెను అత్యాచారం చేశారు. ఆ బాలిక గర్భం దాల్చిందని తెలిసి.. నిజం ఏమిటో చెప్పాలని అడగ్గా మొత్తం ఘటనను బయట పెట్టింది.

    నకిలీ గుర్తింపుతో అమ్మాయికి దగ్గరవ్వడమే కాకుండా బలవంతంగా మతమార్పిడి కోసం ప్రయత్నించిన ఘటన బయటకు వచ్చింది. 15 ఏళ్ల బాలిక మాజిద్ ఖాన్ (23) తో పరిచయం ఏర్పడింది. ఆమె గత సంవత్సరం మహారాష్ట్రలోని మాలెగావ్‌లో కార్మికురాలిగా పనిచేస్తున్నప్పుడు తన పేరును మోహిత్ అని పరిచయం చేసుకున్నాడు మాజిద్ ఖాన్. మైనర్ తో స్నేహం చేసిన మాజిద్ ఖాన్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ తరువాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత ఏడాది అక్టోబర్‌లో మాజిద్ ఖాన్ అమ్మాయిని ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చడానికి ప్రయత్నించాడు. ఆమె మతమార్పిడిని ఒప్పుకోకపోవడంతో ఖాన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేకపోయింది.

    ఆ తర్వాత అమ్మాయి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ పోలీసులను సంప్రదించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది.

    “ఆమెకు ఆసుపత్రిలో ప్రసవం జరిగింది.. శిశువు మరణించింది. ఆ సమయంలోనే ఆ అమ్మాయి తనకు జరిగిన విషయాన్ని ఆసుపత్రిలోని మరో మహిళకు తెలిపింది. ఈ ఘటనపై హిందూ సంస్థలకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది ”అని ఉజ్జయిని ఎఎస్‌పి అమ్రేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ సంఘటనపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం మొదలైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో మైనర్ సహాయంతో పోలీసులు ఖాన్‌ను ఉజ్జయిన్‌కు పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి మలేగావ్ పోలీసులకు అప్పగించారు. అలాగే కేసు నమోదు చేశారు.

    ఉజ్జయిని పోలీసు సూపరింటెండెంట్ సతేంద్ర శుక్లా మాట్లాడుతూ “మధ్యప్రదేశ్‌లోని బాలిక సొంత జిల్లా బార్వానీలో కేసు నమోదు చేయడం గురించి చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని.. మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం వర్తించదని” తెలిపారు. మైనర్ బాలికకు పుట్టిన బిడ్డ మృతదేహానికి డిఎన్ఏ పితృత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా పట్టుబడని మిగతా ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

    Related Stories