Telugu States

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసిన మంత్రి రోజా

రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై నారా లోకేశ్ విషం చిమ్ముతున్నారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా. ఆయనకు అభివృద్ధి కనపడలేదంటే నేత్ర వైద్యుడిని కలవాలని.. ఇచ్చిన హామీలన్నింటిని జగన్ తీరుస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి గతంలో బాలకృష్ణ ఎన్నో మాట్లాడారని, ఆయనపై అప్పట్లో చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగారు. అమావాస్యకో, పౌర్ణమికో ఒకసారి వచ్చి బాలకృష్ణ మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలు ఏపీ వైపు చూస్తుంటే టీడీపీ మాత్రం ప్రభుత్వంపై బురదచల్లే పని చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని మంత్రి రోజా అన్నారు. అవినీతికి తావు లేకుండా, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జగన్ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Back to top button