More

    ఆ ఆడియో తనదేనని చెప్పేసిన మంత్రి కేటీఆర్

    తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక సమయంలో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ టెలిఫోన్ సంభాషణ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని , ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయేది లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని చెబుతూ వచ్చారు.

    ఈ ఆడియో కాల్ గురించి మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ నేత జగన్నాథానికి కాల్‌ చేసి మాట్లాడింది తానేనని స్పష్టం చేశారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆ బీజేపీ నేత సహ.. మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులని, కార్యకర్తలని ఓటు అడిగే హక్కు తమకుందని అన్నారు. వారందరికీ రైతుబంధు, రైతు భీమా సహ మిగిలిన ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయని, పనిచేశాం కాబట్టి ఫోన్ చేసి ఓటు అడగడంలో తప్పేముందని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు ఉంటే.. ఆయన కూడా తమకే ఓటు వేయాల్సి ఉందన్నారు. కాల్ చేసి అడిగినందుకు జగన్నాథం సానుకూలంగానే స్పందించారని, మిగతా వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గట్టుప్పల్ మాజీ సర్పంచ్ జగన్నాథం మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సహకరించాలని కోరారని, కొత్తగా మండలం ఇచ్చామని, దాని అభివృద్ది కోసం నిధులతోపాటు అన్ని రకాలుగా సమకూరుస్తామని చెప్పారన్నారు. అయితే బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రలోభాలకు దిగిందని ఆరోపిస్తున్నారు.

    Trending Stories

    Related Stories